అంగారక గ్రహానికి చేరుకున్న ఒబామా

అంగారక గ్రహంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతకం చేసిన ఓ అల్యూమినియం ఫలక ఫొటోను మార్స్‌ క్యూరియాసిటీ రోవర్‌ తీసి పంపింది. క్యూరియాసిటీ రోవర్‌ మార్స్‌పై పరిశోధనలు చేపడుతున్న విషయం తెలిసిందే. రోవర్‌కు సంబంధించిన ట్విటర్‌ విభాగం ఆ పరికరంపై ఉన్న ఒబామా సంతకంతో కూడిన ఫలక ఫొటో తీసి ట్వీట్‌ చేసింది. ఈ ఫలకపై ఒబామాతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌, ఇతర అధికారుల సంతకాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోవర్‌కు చెందిన మార్స్‌ హ్యాండ్‌ లెన్స్‌ ఇమేజర్‌ ఈ చిత్రాన్ని తీసి పంపించింది. రోవర్‌కు ముందు భాగంలో బోల్ట్‌లతో ఈ ఫలకను బిగించారు. ఈ చిత్రాన్ని తీసి పంపినందుకు ఒబామా నాసాకు కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 20న అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి ఒబామా దిగిపోతున్న సంగతి తెలిసిందే. తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com