అంజీరా తినాలి మిత్రమా

పురాతన కాలం నుంచి ఆరోగ్యాన్ని పంచుతున్న పండ్లలో అంజీర్ ఒకటి. ఇది పోషకాలు, విటమిన్లు, ఖనిజాల సమూహం. కాలి గోటి నుంచి జుట్టు వరకూ మనిషి శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.అంజీర్‌లో అధిక శాతం ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, రాగి, పొటాషియం, విటమిన్ కె, బీ6 ఉంటాయి.వీటివల్ల ఎముకలకు చాలా బలం చేకూరుతుంది. అధిక రక్తపోటును నివారించేందుకు సహాయపడుతుంది. అంజీర్ పండు మలబద్ధకానికి, జీర్ణ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం. 2-3 పండ్లను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తేనెలో కలిపి తింటే మలబద్ధకానికి వీడ్కోలు చెప్పొచ్చు.ఈ పండులో ఉండే పొటాషియం రక్తపీడనంలో హానికరమైన ప్రభావాలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే సోడియం శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.వీటిని నిత్యం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి.ఇందులో ఉండే ఫైబర్ పెద్దపేగుకు చాలా మేలు చేస్తుంది. క్యాన్సర్ కారక సమస్యలను నివారించడే కాకుండా.. పేగు లోపల ఆరోగ్యవంతమైన కదిలికలను మెరుగుపరుస్తుంది. వీటిల్లో ఉండే కాల్షియం, భాస్వరం.. ఎముక, గొంతు సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. ఎండిన అంజీర్ పండ్లలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండినవి తినడం వల్ల శరీరంలోని ఐరన్-డెఫిషియన్సీ అనీమియా సమస్యను నివారిస్తుంది.ఎండబెట్టిన అంజీర్ తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా దీనిని తినవచ్చు.రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్న మహిళలు వీటిని తినడం శ్రేయస్కరం.గర్భిణులు అంజీర్ పండ్లను తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎముకలకు బలం చేకూరుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com