రాజమౌళి.. రామ్చరణ్.. రామారావు పేర్లలో మొదటి ఆంగ్ల అక్షరం ‘ఆర్’ వచ్చేలా ‘#RRR’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని ఇటీవల తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్ని రాజశేఖర్ సతీమణి, నటి జీవిత ఖండించారు. ‘మా కుమార్తె తొలి సినిమా ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి రాజమౌళిని కలిశాం. ఆయన కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఇద్దరిని ఒకే చోట చూసిన ప్రజలు అలా ఊహించుకుని ఉంటారు’ అని అన్నారు. అంతేకాదు సినిమా కోసం రాజమౌళి తన భర్తను సంప్రదించలేదని పేర్కొన్నారు.