అంతా పచ్చి మోసం

ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయ్‌ అలుక్కాస్‌కు ఆదాయ పన్ను అధికారులు షాక్‌ ఇచ్చింది. పన్ను ఎగవేత ఆరోపణలతో సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయ ప​న్ను అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. చెన్నైలోని అనేక ప్రదేశాలలో జ్యూయలరీ చైన్ జోయలక్కాస్‌కు చెందిన పలు షోరూంలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం ఈ శోధనలు ప్రారంభించారు. ఎగవేత ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీనియర్ ఆదాయపు పన్ను అధికారి మీడియాకు చెప్పారు. కాగా గల్ఫ్ దేశాలలో స్థాపించబడిన జ్యూయలరీ మేజర్‌ జోయ్‌ అలుక్కాస్‌ గ్రూపు ఒమన్, బహ్రెయిన్, ఇండియా , యూకే సహా 11 దేశాలలో 130 షోరూంలను నిర్వహిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com