అంతా శాస్త్రం ప్రకారమే జరుగుతోంది

ఆగమశాస్త్రం ప్రకారమే శ్రీవారికి కైంకర్యాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు కృష్ణదీక్షితులు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలను పలువురు ఖండించారు. ఆదివారం అర్చక భవనంలో పలువురు అర్చకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణదీక్షితులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆగమ సలహా మండలి, అర్చకుల ఆమోదంతోనే మార్పులు చేసినట్లు కృష్ణ దీక్షితులు తెలిపారు. శిథిలావస్థకు చేరుకోవడంతోనే పోటు మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. అందులో ఎటువంటి తప్పిదాలు లేవని కృష్ణ దీక్షితులు తెలిపారు. అప్పుడు పోటు కూల్చివేతకు అంగీకరించింది రమణదీక్షితులేనని వేణుగోపాల దీక్షితులు తెలిపారు. రమణదీక్షితుల స్థానంలో మరొకరు రాకూడదా? అని ప్రశ్నించారు. ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు, సౌందర్యరాజన్‌తో అర్చకులకు ఏం సంబంధమని వ్యాఖ్యానించారు. వేరే ప్రాంతంలో ప్రసాదాల తయారీకి రమణ దీక్షితులే అంగీకరించారని చెప్పారు. పురావస్తు శాఖకు శ్రీవారి ఆలయాన్ని ఎందుకు అప్పగించాలని, ఎప్పుడైనా రమణదీక్షితులు 12 నామాలు ధరించారా? అని ప్రశ్నించారు. తన తరువాతే రమణదీక్షితులు కైంకర్యాలకు వచ్చారన్నారు. అర్చకులు ఎవరైనా సెంటు కొట్టుకొని ఆడి కారులో కైంకర్యాలకు వస్తారా? అని విమర్శించారు. రమణదీక్షితుల వ్యవహారంపై ముఖ్యమంత్రికి ఎప్పుడో ఫిర్యాదు చేశామని, 2013 నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. రమణదీక్షితులపై ఎన్నో ఆరోపణలున్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని వేణుగోపాల దీక్షితులు డిమాండ్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com