అంతా సూపర్

భారత సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రస్తుత పరిస్థితి అంతా సవ్యంగానే ఉందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. బెంగళూరులో ఇన్ఫోసిస్‌ 2017-18 అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కంపెనీలో అంతా సవ్యంగానే ఉంది. నందన్‌ నీలేకని ఛైర్మన్‌గా ఉండగా.. తాము ఇక ఆనందంగా నిద్రపోవచ్చు’ అని విలేకరులతో అన్నారు. నీలేకని సమర్థమైన వ్యక్తి అని, సంక్లిష్టతలను సులువుగా ఎదుర్కొనే నేర్పు ఆయన సొంతమని వ్యాఖ్యానించారు. అంతా ఆయనకు వదిలేసి, అందరూ వూరుకుంటే ఆయన విధిని సక్రమంగా నిర్వర్తించగలరని అన్నారు. నీలేకనికి ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కంపెనీ కోసం ఏం చేయాలో ఆయనకు తెలుసంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కాగా, పనయా కొనుగోలుకు సంబంధించి నీలేకని క్లీన్‌చిట్‌ ఇవ్వడం పట్ల గతంలో మూర్తి ఒకింత అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com