అకీరా ఆగమనం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కుమారుడు అకిరా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రేణు దేశాయ్‌ దర్శకత్వంలో 2014లో ‘ఇష్క్‌ వాలా లవ్‌’ అనే మరాఠి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో అకిరా ఓ పాత్రను పోషించాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్‌ చేసి విడుదల చేయనున్నారు. ఈటీవీ ఛానల్‌లో సెప్టెంబరు 4న ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నారని రేణు దేశాయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. చివరికి మనం అకిరాను ఓ చిన్న పాత్రలో తొలిసారి తెరపైన చూడబోతున్నాం.. అని ట్వీట్‌ చేశారు. మరి ఈ చిత్రంలో అకిరా ఎలాంటి పాత్రను పోషించాడో, ఎలాంటి లుక్‌లో కనిపిస్తాడో అన్న విషయం తెలియాలంటే సెప్టెంబరు 4 వరకు ఎదురుచూడాల్సిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com