అక్కడ అబ్బాయిలను కిడ్నాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటారు

మహిళలను ఎత్తుకెళ్లి ​ బలవంతంగా పెళ్లిచేసుకునే సంప్రదాయాన్ని పురాణకాలంలో రాక్షస వివాహంగా పేర్కొన్నేవారు. అయితే ఇదే సంప్రదాయం రివర్స్ అయ్యింది. ఏకంగా అబ్బాయిల్ని అపహరించి బలవంతంగా వివాహం చేసుకోవడంపై జనం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు బిహార్‌లో గతేడాది 3,400 చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. గతేడాది 3405 మంది యువకుల్ని కిడ్నాప్ చేసి, బలవంతంగా వివాహం చేసుకున్నారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇందుకు అంగీకరించకపోతే వారిని, వారి కుటుంబసభ్యులను చంపుతామని బెదరింపులకు పాల్పడతారని ఆయన పేర్కొన్నారు. పకడవ్ వివాహంగా పిలిచే ఈ దుస్సంప్రదాయం బిహార్‌లో అధికంగా ఉందని అన్నారు. తనపై తుపాకి గురిపెట్టి బెదిరించి, బలవంతంగా యువతి మెడలో తాళికట్టించారని, ఆమెతో కాపురం చేయలేనని గత నెలలో బీహార్‌కు చెందిన ఓ ఇంజినీర్ మీడియా ముందుకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇలాంటి వివాహాలు 2016లో 3,070, 2015లో 3,000, 2014లో 2,526 నమోదయ్యాయని, దాదాపు ఈ కేసులన్నింటిలోనూ యువకులు, వారి తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. పోలీసుల నివేదిక ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున ఇలాంటి ఘటనలు తొమ్మిది జరుగుతున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీన్ని సీరియస్‌గా పరిగణించి, బీహార్‌లోని అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com