అక్కర్లేదు

భారత అండర్‌-19 క్రికెటర్లకు ‘యో-యో’ దేహ దారుఢ్య పరీక్ష అవసరం లేదని జూనియర్స్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటున్నాడని సమాచారం! వచ్చేవారం ఆసియా యూత్‌ కప్‌ కోసం మలేసియా వెళ్తున్న భారత జట్టుకు యోయో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. దీనిపై రాహుల్‌ ద్రవిడ్‌, జట్టు యాజమాన్యం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో బీసీసీఐ తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. ‘అండర్‌-19 జట్టుకు యోయో పరీక్ష నిర్వహించాలని టీమిండియా ట్రైనర్‌ ప్రతిపాదించారు. ఐతే జూనియర్‌ క్రికెట్‌కు ఇది అవసరం లేదని ద్రవిడ్‌ అన్నారు. ఈ వయసులో ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. ఫిట్‌నెస్‌ కీలకమే కానీ పరుగులు చేయడం, వికెట్లు తీయడమే ఆటగాడి ఎంపికకు ప్రాతిపదిక’ అని బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ వర్గాలు తెలిపాయి. సీనియర్‌ క్రికెటర్లకు యోయో పరీక్ష తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా ఇప్పటికీ పరీక్ష పాస్‌ అవ్వలేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌ తర్వాత టీమిండియాతో పాటు ఇండియా-ఏ సైతం ఇంగ్లాండ్‌లోనే పర్యటించనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com