అతనితో మళ్ళీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘2.0’ చిత్రం తర్వాత ‘కబాలి’ దర్శకుడు పా. రంజిత్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు, హీరో ధనుష్‌ తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ ప్రై.లి. పతాకంపై నిర్మిస్తున్నారట. ధనుష్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. తన తర్వాతి ప్రొడక్షన్‌ ఫిల్మ్‌ను ప్రకటించడం చాలా గర్వంగా ఉందని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రజనీకాంత్‌ 2010లో విడుదలైన ‘రోబో’కు సీక్వెల్‌గా శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘2.0’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. రజనీ సరసన అమీజాక్సన్‌ నటిస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com