అతనెందుకు అలా?

ఖైదీ నంబరు 150 ప్రీరిలీజ్‌ కార్యక్రమం సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలు చేయటం.. దానిపై దర్శకులు రాంగోపాల్‌ వర్మ స్పందిస్తూ.. వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై చిరు తాజాగా స్పందించారు. సోమవారం తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్స్‌ను పట్టించుకోనని.. నాగబాబు ఏదో సందర్భంలో హర్ట్‌ అయి ఉంటాడు కాబట్టే అలా స్పందించారన్నారు. ‘‘నాగబాబు ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆ రోజు మాట్లాడడానికి ఓ వేదిక దొరికింది. వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవు. ఆర్జీవీ కూడా నాతో బానే ఉంటారు. కానీ.. ఇప్పుడు ఎందుకు అలా ట్వీట్లు చేస్తున్నారో తెలీటం లేదు’’ అని చెప్పారు. వర్మ ట్వీట్లను పాజిటివ్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com