అతివేగంగా దూసుకెళ్తున్న పతంజలి

పతంజలి.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది యోగా గురు రాందేవ్ బాబానే. ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన ‘పతంజలి’ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) మార్కెట్‌ను ఏలుతున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మార్కెట్లోకి వచ్చీ రావడంతోనే దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న పతంజలి ఉత్పత్తులు 2016 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 146 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. మొత్తం టర్నోవర్ 769 మిలియన్ డాలర్లు. ఇప్పటి వరకు ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఓ ఊపు ఊపేసిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజల ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం గమనార్హమని అసోచామ్-టెక్ సైన్స్ రీసెర్చ్ పేర్కొంది. ‘‘నిజానికి పతంజలి ఆయుర్వేద ఔషధాలు తయారుచేయాలని తొలుత భావించింది. అయితే క్రమంగా ఆహారోత్పత్తులు, కాస్మొటిక్స్ తయారీ ప్రారంభించింది. మొత్తంగా 500 రకాలు ఉత్పత్తులున్నాయి. వీటిలో చాలావరకు ఎఫ్ఎంసీజీ కేటగిరీలోకే వస్తాయి’’ అని అసోచామ్ పేర్కొంది. పతంజలి ఉత్పత్తులైన దంతకాంతి, అటా నూడుల్స్, కేశ్‌కాంతి తదితర ఉత్పత్తులు మార్కెట్లోని ఇతర కంపెనీల షేర్లను లాగేసుకున్నట్టు నివేదిక పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com