అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రం ఇదే

నీతిఆయోగ్‌ విడుదల చేసిన ఆరోగ్యకరమైన రాష్ట్రాల జాబితాలో కేరళ తొలి స్థానంలో నిలిచింది. కాగా ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌ అట్టడుగు స్థానంలో ఉంది. పెద్దరాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు వేర్వేరుగా నీతిఆయోగ్‌ జాబితాను రూపొందించింది. పెద్ద రాష్ట్రాల్లో కేరళ మొదటి ర్యాంక్‌లో ఉండగా.. పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌ ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఒడిశా చివరి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ 8, తెలంగాణ 11వ ర్యాంక్‌లో నిలిచాయి. ఇక చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరాం తొలి ర్యాంక్‌లో ఉండగా.. మణిపూర్‌, మేఘాలయా ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్ష్యద్వీప్‌ ఆరోగ్యకరమైన ప్రాంతంగా నిలిచింది. కాగా.. యూపీ అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే అక్కడ ఆరోగ్య పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని నీతిఆయోగ్‌ పేర్కొంది. అంతేగాక.. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఈ విషయంలో చాలా వేగంగా అభివృద్ధి చెంది.. ఈ సారి 4, 5 ర్యాంకులు దక్కించుకున్నట్లు తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com