అత్యాచారం కేసులో ౨౦ ఏళ్ళు జైలుశిక్ష విధించిన కరీంనగర్ న్యాయమూర్తి

కరీంనగర్‌లో ఓ యువతిపై అత్యాచారం కేసులో కరీంనగర్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది. 2013 ఏప్రిల్‌ 18న బెల్లంపల్లికి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. నిందితులు సురరాజ్‌ కుమార్‌, సమీర్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ యువతిని నమ్మించి తీసుకెళ్లి ఈ కిరాతకానికి ఒడిగట్టారు. ఐదేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా రామగుండంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. దీంతో ఐదో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి నాగరాజు నిందితులకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఐదేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతి పెద్దపల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి పట్నా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. రైలు పెద్దపల్లిలో ఆగదని తెలుసుకుని రామగుండంలో దిగింది. మరో రైలు కోసం విశ్రాంతి గదిలో నిరీక్షిస్తున్న సమయంలో రామగుండంలోని భరత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సమీర్‌ (20) అలియాస్‌ అఖిల్‌ అక్కడికి వచ్చి ఆమెతో పరిచయం పెంచుకుని దగ్గరయ్యాడు. సమీపంలోని పార్కు ఉందని అక్కడ కూర్చుందామని తీసుకువెళ్లాడు. యువతికి తెలియకుండా సమీర్‌ తన స్నేహితునికి ఫోన్‌ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. దీంతో అక్కడికి చేరుకున్న రాజ్‌కుమార్‌ (22) అనే యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో సమీపంలోని వారు అక్కడికి వచ్చేలోపు వారిద్దరు అక్కడ నుంచి పారిపోయారు. యువతి ఫిర్యాదు మేరకు రామగుండం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో సాక్షులను విచారించిన కరీంనగర్‌ జిల్లా ఐదో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి నాగరాజు శుక్రవారం ఇద్దరు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com