అదొక లాఫింగ్ క్లబ్

కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ అని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ విషయాన్ని కనీసం చిన్న పిల్లలు సైతం నమ్మరు. కాంగ్రెస్‌ ఇప్పుడు లాఫింగ్‌ క్లబ్‌ అయ్యింది.’ అని మోదీ విమర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com