అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ ప్రవేశపెట్టాలి

అనంతపురం జిల్లాలో ప్రారంభించనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ తరగతులను ఏర్పాటు చేయకపోవడం పట్ల కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తపరిచారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఈ నూతన విశ్వవిద్యాలయంలో హిందీని తప్పకుండా బోధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లేఖ రాశారు. ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి కూడా ఈ అంశాన్ని ఆయన తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ అంశాన్ని పరిగణించవల్సిందిగా కోరాలని వెంకయ్య ఆదేశాలు జారీ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com