అనర్హులమని గుర్తించారు

దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేలో భారత్‌కు గెలిచే అర్హత లేదని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆతిథ్య సఫారీ జట్టు చేతిలో ఓడిన తీరుపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను కుదించారు. లక్ష్యాన్ని 28 ఓవర్లకు 202 పరుగులు చేయాల్సిందిగా నిర్ణయించారు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ..‘ లక్ష్యాన్ని కుదించడంతో ఈ వన్డే ఓ టీ20 మ్యాచ్‌లా మారింది. మాకు అనుకూలంగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. మేము మ్యాచ్‌లో గెలుపొందేందుకు అనర్హులం’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో వచ్చిన ఛాన్స్‌లను పోగొట్టుకోకూడదు. ప్రత్యర్థులను కట్టడి చేయాలనుకుంటున్న తరుణంలో ఒకే ఓవర్లో డేవిడ్‌ మిల్లర్‌ రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో విరాట్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఛేదనలో చాహల్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ 6 పరుగులతో ఉండగా అతడి క్యాచ్‌ను శ్రేయాస్‌ అయ్యర్‌ వదిలేశాడు.. మళ్లీ అదే ఓవర్లో మిల్లర్‌ బౌల్డయినప్పటికీ.. అది నోబాల్‌గా తేలడంతో అతను మరోసారి బతికిపోయాడు. ఈ రెండు అవకాశాలే మ్యాచ్‌ను మలుపుతిప్పాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com