అనుష్క-ఆకర్షణ

‘‘సినిమా అనేది రంగుల ప్రపంచం. తెర వెలిగిపోతూ ఉండాలి. ప్రేక్షకుడి ఊహల్ని దాటుకొంటూ కొత్త ప్రపంచం సృష్టించాల్సిందే’’ అంటోంది అనుష్క. ఇటీవల ‘భాగమతి’తో ఓ విజయాన్ని అందుకుందీ భామ. అనుష్క మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమాల్లో వాణిజ్య అంశాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. వాటి చుట్టూ కథలు తిరుగుతాయని అంటుంటారు. అందులో తప్పేముంది? ఓ కథని అలా చూపిస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. తెలుగులోనే కాదు.. దాదాపు అన్ని చిత్రసీమల్లోనూ ఇలాంటి అభిరుచే కనిపిస్తుంది. పాత్రలకు, సన్నివేశాలకు అదనపు హంగులు అద్దాల్సిందే. అది ప్రాథమిక సూత్రం. అయితే బలమైన కథ, శక్తిమంతమైన పాత్రలు లేనప్పుడు ఈ హంగులు కూడా అక్కరకు రావు. కథకు మించిన ఆకర్షణ ఏదీ లేదు’’ అంటోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com