అనుష్క పెట్రోల్ కోసం

అగ్ర కథానాయిక అనుష్క పెట్రోల్‌ అమ్మారు. అదేంటి అనుకుంటున్నారా!.. లేక ఇది సినిమా కోసమై ఉంటుందని ఊహిస్తున్నారా.. ఇవేవీ కాందడీ. మంచు లక్ష్మి ‘మేముసైతం’ అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సీజన్‌ 1 గత ఏడాది పూర్తైంది. కాగా నిర్వాహకులు రెండో సీజన్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మంచులక్ష్మి శనివారం ట్వీట్‌ చేశారు. ‘రేపటి నుంచి ‘మేముసైతం’ సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్‌నగర్‌ రోడ్‌నంబరు 1లో అనుష్క విరాళాలు సేకరించనున్నారు. వెళ్లి సాయం చేయండి’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com