అన్నం వలన మధుమేహం రాదు

రైస్ తింటే శరీరంలో చక్కెర శాతం పెరుగుతుందనేది చాలామంది గాఢాభిప్రాయం. కానీ ఇది నిజం కాదు. రైస్ను పప్పు, కూర వంటి వాటితో కలిపి మితంగా తీసుకుంటే శరీరంలో చక్కెర శాతం పెరగదు. పైగా ఇదెంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా. ఇందుకు కారణాలేమిటో ఈ వారం తెలుసుకుందాం…
చాలామంది మేం రైస్ (తెల్ల అన్నం) తినం అంటుంటారు. ఎందుకు అని అడిగితే ఫ్యాట్ పెరుగుతాం అని జవాబిస్తుంటారు. దీనికి కారణం రైస్లో చక్కెర శాతం ఎక్కువ ఉండడమే. కానీ మనం తినేటప్పుడు రైస్ ఒక్కదాన్నే తినం. దానితోపాటు కూర, పప్పు, పెరుగు కూడా తింటాం. ఇలా తినడంవల్ల ప్రొటీన్లు, పీచుపదార్థాలు శరీరంలోకి వెడతాయి. రైస్ తినడం వల్ల చక్కెర శాతం పెరగదు. ఫ్యాట్ అవ్వరు. మితంగా తీసుకుంటే ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం.
**రైస్ శరీరానికి మంచిదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి
రైస్ శరీరానికి కావాల్సిన ఎనర్జీని వేగంగా అందిస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేట్టు సహకరిస్తుంది.
జీర్ణసంబంధమైన సమస్యలతో, అల్సర్, కడుపునొప్పితో బాధపడేవారికి రైస్ ఆరోగ్యకరమైన ఆహారం. తేలిగ్గా జీర్ణమైపోతుంది. రైస్ వల్ల ఎలాంటి ఎలర్జీలు రావు. మధుమేహంతో బాధపడేవారు కూడా దీన్ని తీసుకోవచ్చు. కానీ పరిమిత పాళ్లల్లో తీసుకోవాలి. ఇది యాంటి ఇన్ఫ్లమేటరీ కూడా . తిన్న వెంటనే నిద్ర వస్తుంది. రైస్లో ఉండే మాంగనీసు వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రైస్లో బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియ సరిగా జరిగేట్టు సహకరిస్తుంది. అందులోని థయామైన్ ఆలోచనాశక్తిని పెంచుతుంది. జీర్ణకోశాన్ని ఇరిటేట్ చేసే గ్లూటెన్ ఇందులో ఉండదు.రైస్లో ఉన్న అమినోయాసిడ్ కంపోజిషన్ పరోక్షంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రైస్లోని మెథియొనైన్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్ జబ్బులతో బాధపడేవాళ్లు కూడా రైస్ తినొచ్చు. రైస్ వల్ల శరీరంలోని సెరొటోనిన్, మెలటోనిన్ హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. ఇందులో టైరోసైన్ అనే మరో ఎమినో యాసిడ్ ఉంది. అడ్రనలిన్ వంటి సె్ట్రస్ హార్మోన్ల మీద ఇది బాగా పనిచేసి చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది.*
**వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్…ఏది మంచిది?
బ్రౌన్ రైస్లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్నంత ఎక్కువ న్యూట్రియంట్లు వైట్ రైస్లో ఉండవు. కానీ బ్రౌన్ రైస్ తొందరగా జీర్ణం కాదు. వైట్ రైస్ తినేటప్పుడు తక్కువ పాలిష్ ఉన్న వాటిని తింటే మంచిది. బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ ఇష్టపడేవాళ్లు చాలామంది ఉంటారు. వీళ్లు అన్నంలో పప్పులు కలిపి ఉడకబెట్టి తింటే మంచిది. అన్నం ద్వారా పోషకపదార్థాలు శరీరం లోపలికి వెళతాయి. పరిమితి మించకుండా రైస్ తింటే వచ్చే నష్టం ఏమీ లేదు. రైస్కు బదులు రిఫైన్డ్ ఫుడ్ని తినడం మానితే చాలా మంచిది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com