అన్నదమ్ములు ఒకేసారి

అగ్ర కథానాయకుడు చిరంజీవి తన 152వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రంలో చిరు సోదరుడు.. పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో పవన్‌ పాత్ర అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. చిరంజీవి-ప‌వ‌న్‌ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్లు ప్ర‌ముఖ నిర్మాత టి.సుబ్బ‌రామిరెడ్డి గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 2007లో వచ్చిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ అతిథి పాత్రలో అలరించారు. ఇప్పుడు ఈ అతిథి పాత్ర గురించి మెగాఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com