అన్నవరం దేవుడికి రికార్డు ఆదాయం

అన్నవరం వీరవేంకట సత్యనారాయణస్వామివారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. 42 రోజులకు సంబంధించి హుండీ ఆదాయాన్ని బుధవారం సిబ్బంది లెక్కించారు. ఈవో ఎం.జితేంద్ర, ధర్మకర్తల మండలి సభ్యులు కొత్త వెంకటేశ్వరరావు, సింగిల్‌దేవి సత్తిరాజుల పర్యవేక్షణలో లెక్కించారు. రూ.1,47,95,795 నగదు, రూ.8,06,135 చిల్లర నాణాలతో కలిపి మొత్తం 1,56,01,930 వచ్చింది. కొద్దిరోజులుగా వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటం, వేసవి సెలవులు, కల్యాణ మహోత్సవాలతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగిందని అధికారులు చెప్పారు. యూఎస్‌ఏ, సింగపూర్‌, మలేషియా, ఇంగ్లండు, కువైటు తదితర దేశాల కరెన్సీ సైతం వచ్చింది.
**ఇంకా వస్తున్న పాతనోట్లు
రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు ఇప్పటికీ భక్తులు హుండీల్లో వేస్తున్నారు. తాజాగా లెక్కింపులోనూ రూ.500 నోట్లు 61, రూ.1,000 నోట్లు 4 మొత్తం రూ.34,500 వచ్చింది. ఇలా ప్రతిసారీ హుండీల లెక్కింపులో వస్తున్న పాతనోట్లు దేవస్థానంలో పేరుకుపోతున్నాయి.
**వసతి గదులకు డిమాండ్‌
వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో దేవస్థానంలో వసతి గదులకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఓ వైపు సిఫార్సు లేఖల ఒత్తిడి, మరోవైపు భక్తుల రద్దీతో గదులను సర్దుబాటు చేయలేక అధికారులు ఇబ్బందులు పడ్డారు.
**1,593 వ్రతాలు
దేవస్థానంలో బుధవారం ఒక్కరోజే 1,593 వ్రతాలు జరిగాయి. వ్రతాలు, ప్రసాద విక్రయాలద్వారా రూ.11 లక్షల ఆదాయం సమకూరింది. నిత్య అన్నదానానికి పలువురు భక్తులు రూ. 1.28 లక్షలను విరాళాలుగా ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com