అన్ని సెలవలు రద్దు

వర్షాకాలం నాటికి నగరంలో రోడ్ల నిర్వహణ మెరుగుపడాలని అందు కోసం జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ సిబ్బందికి వచ్చే రెండు నెలల పాటు సెలవు రద్దు చేయాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ంఎసీ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో రోడ్ల నిర్వహణ ప్రణాళికపై మంత్రి సోమవారం జలమండలి కార్యాలయంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, హెచ్చార్డీసీ, ఇంజినీరింగ్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నగరంలో రోడ్ల నిర్వహణ కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అవసరమైతే ప్రతినెలా ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. నగరంలోని ఒక్కో వార్డుకు ఒక్కో ఏఈ స్థాయి అధికారిని నియమించామన్నారు. అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ రోడ్ల నిర్వహణలో లోపాలున్నట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను మంత్రి హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలను జోనల్‌ కమిషనర్లు ప్రత్యేక బాధ్యత తీసుకుని వాటిని పరిష్కరించాలని మంత్రి సూచించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులు రాబోయే రెండు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. నగరంలో చేపడుతున్న వాటర్‌వర్క్స్‌ పైపులైన్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనూ రోడ్ల మరమ్మతులపై జీహెచ్‌ఎంసీ జలమండలితో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, మెట్రోరైల్‌ ఎండి. ఎన్‌.వీ.ఎస్‌ రెడ్డి, జలమండలి ఎం.డి.దానకిశోర్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com