అభినందన మందారమాల

శుక్రవారం విడుదల కానున్న ‘సైజ్‌ జీరో’ చిత్ర బృందానికి ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, హీరోలు వెంకటేశ్‌, ప్రభాస్‌లు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా అభినందనలు తెలిపారు. ఈ చిత్రం కోసం దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడి, కనిక, అనుష్కలు చాలా కష్టపడ్డారన్నారు. ఇది ఒక ప్రత్యేక కథా చిత్రమని పేర్కొన్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సైజ్‌ జీరో’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com