అమరనాథ్ యాత్రికులపై దాడులకు కుట్ర

అనంతనాగ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. కుల్గాంలో నేడు మరో ఎన్‌కౌంటర్‌.. అనంతనాగ్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి గ్రెనేడ్ల స్వాధీనం.. గత మూడు రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో జరిగిన ఘటనలు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అమర్‌నాథ్‌ యాత్రపై భారీ దాడులు చేయాలని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్ర సంస్థలు కుట్రలు పన్నినట్లు వచ్చిన ఇంటెలిజెన్స్‌‌ సమాచారాన్ని ఈ ఘటనలు ధ్రువీకరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ యాత్రను ఒక సవాలుగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2.5లక్షల మంది అత్యంత భక్తితో అనేక కష్ట నష్టాలకు ఓర్చి చేసే అమర్‌నాథ్‌ యాత్రపై ఆత్మాహుతి దాడులు చేయాలని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. దీని కోసం ఫిదాయిలకు (ఆత్మాహుతి దళాలు) పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇప్పటికే శిక్షణ ఇచ్చాయి. వీరు కారుబాంబులను వినియోగించి దాడులు చేసేందుకు సిద్ధమ్యారు. ఈ విషయాన్ని భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. పీడీపీతో విభేదాలు పొడచూపడంలో అమర్‌నాథ్‌ యాత్ర అంశం కూడా ఒక కారణం. ఇప్పటికే ఉగ్రదాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉన్నా పీడీపీ ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలేదని కేంద్రం అభిప్రాయపడింది. దీనికి తోడు జమ్ముకశ్మీర్‌ పోలీసులకు, సైన్యానికి మధ్య రాష్ట్రప్రభుత్వం కారణంగా సమన్వయం లోపించిందని భావించింది. ఇదే కొనసాగితే క్షేత్రస్థాయిలో ఉగ్రవాదుల సమాచారం భద్రతా దళాలకు అందడంలో జాప్యం జరుగుతుంది. దీంతో పీడీపీతో బంధం తెంచుకొని కేంద్రమే అమర్‌నాథ్‌ యాత్ర ఏర్పాట్లను చేపట్టింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com