అమలా అభినందనలు

లైంగిక వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు నటి అమలాపాల్‌ను నటీనటుల సంఘం అభినందించింది. కొన్నిరోజుల క్రితం టీనగర్‌లో నృత్య శిక్షణ పొందుతున్న తరుణంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమలాపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సంబంధిత వ్యక్తిని అరెస్టు చేశారు. అమలాపాల్‌ను అభినందిస్తూ నడిగర్‌ (నటీనటుల) సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు చెప్పేందుకు వెనకాడుతున్న పరిస్థితుల మధ్య అమలాపాల్‌ ధైర్యంగా ముందుకురావడం అభినందనీయమని పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మాంబలం ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు నిందితుడిని అరెస్టు చేశారని ప్రస్తావించింది. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com