అమెరికాలో అరుదైన రికార్డు నెలకొల్పిన వల్లభనేని శ్రీలక్ష్మి

కష్టపడో.. ఇష్టపడో చదవడం ఆపై మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం ఈ జీవితానికి ఇది చాలు అని సంతృప్తి చెందడం జీవితమంటే ఇంతేనా ?ఎంతమాత్రం కాదంటారు డా. శ్రీలక్ష్మి వల్లభనేని. అమెరికాలో ప్రతిష్టాత్మక డేవిడ్ సి.లిచ్ అవార్డు అందుకున్న తోలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన శ్రీలక్ష్మి సామాజిక సేవలోనూ ముందున్నారు. తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న తల్లి మాటలు ఆమెపై బాగా పనిచేశాయి. ఆ ఫలితమే ప్రతినెలా ఆమె వేతనం నుంచి కొన్ని డాలర్లు సేవ కొసం ఆత్రుతగా వెళ్ళిపోతుంటాయి.
**ఉన్నత విద్యావంతులు కుటుంబంలో జన్మించిన శ్రీలక్ష్మి వల్లభనేని తల్లిదండ్రులుది కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు. తల్లి సుజాత, తండ్రి సత్యరామప్రసాద్. తాత (సత్యరామ ప్రసాద్ తండ్రి) క్రిష్ణాజిరావు ఏలూరు సి ఆర్ ఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్. క్రిష్ణాజిరావు సతీమణి నాగశిరోమణి, ఉద్యోగ రిత్యా ఏలూరు వచ్చిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడింది. సుజాత తల్లిదండ్రులు చుండ్రు కొండలరావు, అమ్మాజీ. అందరూ ఉన్నత విద్యావంతులే. అందులోనూ ఎక్కువమంది వైద్యులుగా స్థిరపడడం మరో విశేషం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీలక్ష్మి కూడా వైద్యురాలిగా దేశ కీర్తి ప్రతిష్టలను విదేశాల్లో చాటుతున్నారు. ప్రతిష్టాత్మక డేవిడ్ సి. లిచ్ అవార్డు అందుకుని భారత కీర్తి పతకాన్ని అమెరికాలో రెపరెపలాడిస్తున్నారు.
**విద్యాభ్యాసం జరిగిందిలా..
శ్రీలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్, విజయవాడలో సాగింది. చిన్నప్పటి నుంచి చదువులో మేరికలా ఉండే శ్రీలక్ష్మి ఇంటర్ పూర్తీ కాగానే రాసిన మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకు సాధించింది. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో ఉన్న ఎన్నారై కళాశాలలో చేరి 2011లో మెడిసిన్, హౌస్ సర్జన్ పూర్తీ చేసింది. మెడిసిన్ చదువుతుండగానే కళాశాల తరపున అమెరికా వెళ్లి పెన్సిలేన్వియాలోని టెంపుల్ యూనివర్సిటిలో క్లార్క్ షిప్ పూర్తీ చేసి తిరిగి వెనక్కి వచ్చి హౌస్ సర్జన్ పూర్తీ చేసింది. 2014లో బాల్టిమోర్ లోని మోడ్ స్టార్ హార్బర్ ఆసుపత్రిలో చేరిన ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సి పూర్తీ చేసింది. అక్కడ జాయిన్ కావడానికి ఫెలోషిప్ చేసింది. 2017లో రెసిడెన్సి పూర్తయిన వెంటనే బెత్లహెం లోని సెయింట్ ల్యూక్ యూనివెర్సిటిలో కార్దియాలజీలో ఫెలోషిప్ చేరింది.
**అమెరికాలో సరికొత్త చరిత్ర.
బాల్టీమోర్ లోని మొద్ద్ స్టార్ హార్బర్ ఆసుపత్రిలో రెసిడెన్సిలో ఉన్నప్పుడే డా.శ్రీలక్ష్మి పేషెంట్ కేర్ కోసం కొన్ని ప్రాజెక్టులు చేసారు. వాటిని చూసిన యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు అచ్చెరువొందారు. ఆమె ప్రతిభకు మెచ్చిన ఆయన అమెరికాలోని ఫెలోషిప్ రెసిడెంట్ల కోసం ఏర్పాట్లు చేసిన ప్రతిష్టాత్మక డేవిడ్ సి.లిచ్ అవార్డుకు శ్రీలక్ష్మిని నామినేట్ చేసారు. అమెరికా నుంచి ముగ్గురు నలుగురిని మాత్రమే ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన నలుగురిలో శ్రీలక్ష్మి ఒకరు. ఇంతవరకు ఒక్క విదేశీ విద్యార్ధి కూడా ఈ అవార్డుకు ఎంపిక కాలేదు. తొలిసారి ఎంపికైన మొట్టమొదటి భారతీయ వైద్యురాలిగా శ్రీలక్ష్మి రికార్డు సృష్టించారు. మార్చి మొదటి వారంలో ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు.
**నిరంతరం రోగుల ధ్యాసే
శ్రిలక్ష్మికి డేవిడ్ సి.లిచ్ అవార్డు అంత ఆషామాషీగా ఏమీ రాలేదు. రోగుల పై ఆమె చూపించే శ్రద్ద వారి గురించిన ఆలోచనలే ఆమెకి అవార్డును తెచ్చిపెట్టాయి. అనారోగ్యం మనిషిని ఆవహించిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం కంటే ముందే ఆ పని చేయాలంటారు. శ్రీలక్ష్మి . అయితే సాధారణ ప్రజలకు దీనిపై అంట అవగాహనా ఉండదు. అవగాహనా పెరగాలి అంటే వ్యాధులు అవి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు చికిత్సా విధానం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో వారిని చైతన్య పరచగలిగితే విజయం సాధించి నట్టేనని చెబుతారు. అందుకోసం శ్రీలక్ష్మి వన్ పేజ్ పేషంట్ డిశ్చార్జి సమ్మరి అనే ప్రాజెక్టును చేపట్టారు. నిజానికి రోగులు ప్రతిసారి అవసరం ఉన్నా లేక పోయినా రక్త మార్పిడి ఎప్పుడూ చేయించుకోవాలి? ఎవరు చేయించుకోవాలి? ఏ పరిస్థితుల్లో చేయాలి? అనే దాని గురించి వివరించేందుకు ఆర్బీసీ ట్రాన్స్ ప్యుజర్ త్రెషోల్డ్ మాడ్యూల్ తయారు చేశారు. ఈ రెండు ప్రాజెక్టులతో శ్రీలక్ష్మికి మంచి పేరు వచ్చింది.
**శ్రీలక్ష్మి కుటుంబం గురించి ..
శ్రీలక్ష్మి తండ్రి సత్యరామ ప్రసాద్ హైదరాబాద్ లోని వేల్జాన్ అండ్ వెన్నా బయోటిక్ కంపెనీలో కొంతకాలం పని చేసాక తిరిగి ఏలూరు వచ్చేశారు. వయోవృద్దులైన తల్లిదండ్రులును దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. శ్రీకర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. శ్రీకర్ భార్య గీతికా కూడా డెట్రాయిట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు వైపు అందరూ ఉన్నత విద్యావంతులే. వీరిలో ఎక్కువ మంది వైద్యులుగా స్థిరపడ్డారు. సుజాత పిన్ని డాక్టర్ చుండ్రు హేమలత సికింద్రాబాద్ లో ప్రముఖ గైనకాలజిస్ట్, పార్వతి నర్సింగ్ హోమ్ పేరుతొ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. సుజాత సోదరుడు డా.దీపు చుండ్రు హైదరాబాద్ లోని స్టార్ అసుపత్రీలొ ప్లాస్టిక్ అండ్ కాస్మోటిక్ సర్జన్. సుజాత వదిన డా.స్వాతి కూడా వైద్యురాలే కావడం విశేషం.
**అమ్మకిచ్చిన చెప్పిన మాట కోసం..
నేను ప్రతీ పనిని ఏంటో ఇష్టంగా చేశాను. అలాగే చదువుకున్నాను. ఇంట్లో అందరూ చదువుకున్న వార్ ఉకవడంతో స్వాతహాగానే నాకు చదువుపై మమకారం ఏర్పడింది. దీనికి తల్లిదండ్రులు ప్రోత్సాహం, అన్నయ్య సహకారం లభించింది. సమాజం మనకు ఇచ్చిన దాంట్లో కొంతైనా తిరిగి ఇచ్చేయాలన్న అమ్మ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే నాకు చేతనైనంత సాయం చేస్తున్నా. మనదేశంలో ఇద్దరిని, ఘనాలో ఇద్దరు పిల్లలను దత్తత తేసుకున్నా. ప్రతి నెల నా వేతనం నుంచి అరవై డాలర్లు వారి కోసం ఖర్చు చేస్తున్నా. మున్ముందు మరింత సేవ చేయాలని నిర్ణయించుకున్నా. గుండె జబ్బులపై దేశంలో అవగాహన కల్పిస్తా. పూర్తిగా వైద్యానికే పరిమితం కాకుండా వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కోసం కొంత సమయాన్ని కేటాయిస్తా. ఆ దిశగా అడుగులు వేస్తున్నా.-డా.శ్రీలక్ష్మి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com