అమెరికాలో “తెలుగు కామ క్రీడల” గుట్టురట్టవుతోందిగా?-TNI ప్రత్యేకం

గత కొద్దినెలల నుండి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న తెలుగు చలనచిత్ర “రాసలీలలు రంగేళి” ప్రసుతం అమెరికాను తాకింది. సినిమాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువతులకు, జూనీయర్ నటీమణులకు డబ్బులు ఎర చూపుతూ వారి చేత అమెరికాలో చీకటి వ్యాపారం చేయిస్తున్నారన్న ఆరోపణలు గత పదిహేను సంవత్సరాల నుండి వినిపిస్తూనే ఉన్నాయి. కాకపొతే ఆ పాపం ఇప్పుడు పుట్ట బద్దలయ్యింది. అమెరికాలో తెలుగు సదస్సులు జరుగుతున్నప్పుడు వాటికి హాజరవుతున్నామని కారణం చూపి చాలా మంది జూనియర్ నటీమణులు విమానాలు ఎక్కడం సహజంగా మారింది. విమానాలు దిగిన అనంతరం వీరంతా ఆ సదస్సులు జరుగుతున్న ప్రదేశం ఎవరికీ కనిపించేవారు కాదు. వీరంతా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాసలీలల్లో మునిగి తేలేవారు అన్నది బహిరంగ విషయం. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తెలుగు నిర్మాత మోదుగుమూడి కిషన్ దంపతులు ప్రధాన పాత్రదారులైతే వీరికి సహకరించే తెలుగు ఏజెంట్లు దాదాపు అమెరికాలోని ప్రతి ప్రధాన నగరంలో ఉన్నారు. ఇటీవల పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ఏజెంట్లు అమెరికా పోలీసులకు సమాచారం అందించారు. గత ఏప్రిల్ లోనే ప్రధాన నిందితులను నిర్భంధించినప్పటికీ కిషన్ కు హైదరాబాద్ లో ఉన్న పలుకుబడితోనూ డబ్బులు వెదజల్లి ఈ విషయం ఇప్పటి వరకు బయటికి రాకుండా చూశాడు. గతంలో అమెరికాలో తెలుగు వారికి ఏదైనా మనస్పర్ధలు వచ్చినా భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినా వ్యాపారాల్లో గొడవలు వచ్చినా ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నా మన తెలుగు ప్రముఖులు సర్దుబాటు చేసేవారు. ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులకు కుటుంబ కలహాల మూలంగా ఆత్మహత్య చేసుకుంటే వాటిని తెలుగు జాతి పరువు పోతుందనే కారణంతో దాచిపెట్టేవారు.

*** తెలుగు వాడికి పక్కవాడే శత్రువు!
ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి మధ్య గతంలో లాగా ఐకమత్యం లోపించింది. కులాలు, మతాలు పేరుతో ప్రతినిత్యం వర్గాలుగా విడిపోయి తన్నుకు ఛస్తున్నారు. కమ్మా, రెడ్డి, వైశ్య, కాపు, బ్రాహ్మణ తదితరులు కులాల వారిగా విడిపోయి పెద్దఎత్తున సదస్సుల పేరుతో అమెరికాలో తమ ప్రాభల్యాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుల సంఘాల నాయకులు ఈ సదస్సులకు హాజరై అమెరికాలో తెలుగు వారి మధ్య వర్గ, కుల పోరాటాలను పెంచి పోషిస్తున్నారు. వీరు నిర్వహించే సదస్సులకు హాజరవుతున్నామని హైదరాబాద్ నుండి విమానాలు ఎక్కిన కొందరు నటీమణులు సదస్సులకు వెళ్ళకుండా అక్కడ ముందుగా కుదుర్చుకున్న అద్దె మొగుళ్ళతో “రంకు” సంసారాల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కో నటీమణి విడిగానూ, మందల గుంపులుగానూ విడిపోయి సదస్సు అయిన అనంతరం రెండు, మూడు నెలల పాటు అమెరికాలోని ప్రధాన నగరాలలోని మకాం వేసి రాసలీలలో మునిగి తేలుతూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ పసిగడుతున్న ప్రత్యర్ధి వర్గం వారు ఎప్పటికపుడు వీటిని పోలీసులకు, మీడియాకు చేరవేస్తున్నారు.

*** తీగ లాగితే తెలుగు ప్రముఖులు పరువు కూడా పోతుందట
ప్రస్తుతం అమెరికాలో బయటపడిన ఈ రాసలీలల కుంభకోణం వెనుక కొంత మంది తెలుగు ప్రముఖులుగా చెలామణీ అయ్యేవారి హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు తెలుగు సంఘాల నేతలను ఈ విషయం గురించి అమెరికా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. సినీ నటీమణులకు ఇచ్చిన ఆహ్వాన పత్రాల గురించి అమెరికా పోలీసులు ఆరా తీస్తున్నారు. తాము ఇచ్చిన ఆహ్వాన పత్రాలు దుర్వినియోగం అయ్యాయని వీటిలో పేర్లు కూడా మార్చి వేశారనీ తెలుగు సంఘాల నేతలు పోలీసులకు బదులిచ్చినట్లు వినికిడి. మరొక పక్క తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తెల్చాలనీ అమెరికా పోలీసుల నుండి పూర్తి సమాచారం సేకరించాలని తెలంగాణా ప్రభుత్వానికి అమెరికా నుండి విజ్ఞప్తులు అందుతున్నట్లు తెలిసింది. ఇటీవల అమెరికాలో జరుగుతున్న వరుస సంఘటనలు తెలుగు జాతి పరువు తీస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రముఖుడు తరచుగా అమెరికా వెళ్తూ అక్కడ రాసలీల్లో మునిగి తేలుతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణా, ఆంధ్రా ప్రభుత్వాలు కూడా తరచుగా విదేశాలకు వెళ్ళే నటీమణులతో పాటు చీటికిమాటికి అమెరికా వెళ్తున్న రాజకీయ, సినీ రంగాల వారిపై నిఘా పెట్టవలసిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమెరికన్ ఫెడరల్ బ్యూరో అధికారులు ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఈ కుంభకోణానికి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నట్లు త్వరలోనే మరి కొందరు తెలుగువారు అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com