అమెరికావ్యాప్తంగా సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం


గత 10 సంవత్సరాలుగా 27000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి 2017-18 విద్యాసంవత్సరం అమెరికా -కెనడా దేశాలలో సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యాయి. అమెరికాలో 35 పైగా రాష్ట్రాలలో 250 కేంద్రాలలో ఈ విద్యాసంవత్సర తరగతులకు వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు అమెరికా వ్యాప్తంగా ప్రతిష్టాత్మక WASC (Western Association of Schools and Colleges) గుర్తింపు సిలికానాంధ్ర మనబడి సొంతం. క్యాలిఫోర్నియా సన్నివేల్ విభాగంలో తరగతులను ప్రారంభిస్తూ మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, భారత దేశానికి ఎంతో దూరంగా ఉన్నా, మాతృభాషకి దూరం కాకూడదని, పుట్టిన ఊరిలో ఉన్న వారితో బంధాన్ని నిలిపి ఉంచేందుకు మన భాష ఎంతో ముఖ్యమని గుర్తించి మన పిల్లలకు తెలుగు నేర్పించాలన్న లక్ష్యంతో మనబడి ప్రారంభించామని, దశాబ్ది కాలంగా తమ పిల్లలను మనబడిలో చేర్పించి తెలుగు నేర్పిస్తున్న తల్లిదండ్రులకు భాషాసేవయే భావితరాల సేవ! అనే స్ఫూర్తితో తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, భాషా సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో తరగతులను మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట, డాంజి తోటపల్లి, భాస్కర్ రాయవరం, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి తదితరులు పర్యవేక్షించారు. అమెరికావ్యాప్తంగా ఈ వారాంతంలో వివిధ ప్రాంతాల్లో తరగతులు ప్రారంభమైన సందర్భంలో, కూపర్టినో కేంద్రంలో మనబడి తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుభాషకు ప్రపంచపీఠంపై పట్టం కట్టడానికి మనబడి చేస్తున్న కృషిని అభినందించారు. మనబడి 2017-18 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు సెప్టెంబర్ 22, 2017 వరకు అందుబాటులో ఉంటుందని, రిజస్టర్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org చూడాలని మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల కోరారు.






































More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com