అమెరికా ఉపగ్రహం ప్రయోగం విఫలం

అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రయోగించిన రహస్యనిఘా ఉపగ్రహం కక్ష్యలోకి చేరలేదట. రెండో దశలో ఉపగ్రహం రాకెట్ నుంచి వేరుకావడంలో విఫలమైందని కొందరు అధికారులు మీడియాకు తెలిపారు. ఆ ఉపగ్రహం అట్లాంటిక్‌ సముద్రంలో పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. జుమా అనే రహస్య ఉపగ్రహాన్ని అమెరికా ఆదివారం కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ దీన్ని ప్రయోగించింది. అయితే ఈ ఉపగ్రహం దేనికోసమన్నది తెలియరాకపోవడంతో దీన్ని రహస్య ఉపగ్రహంగా పేర్కొన్నారు. నార్త్‌రప్‌ గ్రుమన్‌ సంస్థ అనే దీన్ని రూపొందించింది. మరోవైపు ప్రయోగంపై స్పేస్‌ఎక్స్‌ ప్రతినిధి స్పందించారు. దీనిపై తాము ఇప్పుడే ఎలాంటి వివరాలు చెప్పలేమన్నారు. కాగా.. ఈ ఉపగ్రహాన్ని గత నవంబర్‌లోనే ప్రయోగించాల్సింది. అయితే రాకెట్‌పైన ఉండే కోన్‌ భాగంలో ఏవైనా సమస్యలు ఉన్నాయోమో మరింత నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఉపగ్రహాన్ని ఈ కోన్‌ భాగంలోనే అమరుస్తారు. అంతటి అసాధారణ రక్షణ, గోప్యత ఎందుకన్నది తెలియరాలేదు. స్పేస్‌ఎక్స్‌ సంస్థ గతంలోనూ ఇలాంటి తరహా నిఘా ఉపగ్రహాలను ప్రయోగించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com