అమెరికా కరాటే పోటీల్లో తెలంగాణీయుడి ప్రతిభ

తెలంగాణ రాష్ర్టానికి చెందిన సీనియర్ కరాటే క్రీడాకారుడు జమీల్ఖాన్ అంతర్జాతీయస్థాయిలో మరోసారి సత్తాచాటాడు. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన అంతర్జాతీయ కరాటే కుంగ్ఫూ చాంపియన్షిప్లో జమీల్ ఓ స్వర్ణం, ఓ రజతం, రెండు కాంస్యాలతో మొత్తం మూడు పతకాలు సాధించి అదరగొట్టాడు. సీనియర్ గ్రూప్ (40-49 ఏండ్లు) బ్లాక్బెల్ట్ కేటగిరిలో జమీల్ నాలుగు వేర్వేరు ఈవెంట్లలో ఒక్కో పతకం గెలిచి తనకు తిరుగులేదని నిరూపించాడు. ఈ సందర్భంగా తాను అమెరికా పోటీల్లో పాల్గొనేందుకు సహకరించిన సిటీ హైట్స్ హోమ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ధన్యవాదాలు చెబుతున్నట్లు జమీల్ తెలిపాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com