అమెరికా పోస్టల్ శాఖకు టోకరా వేసిన భారతీయులు

అమెరికా తపాలా సర్వీసులకు ఇద్దరు భారత సంతతి అమెరికన్లు రూ.110కోట్లకు పైగా టోకరా వేశారు. పోస్టల్‌ కార్యాలయ గుమస్తా సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు అధికారిక డేట్‌ స్టాంపును రహస్యంగా వినియోగించడం ద్వారా వారు ఈ మోసానికి పాల్పడినట్లు చికాగోలోని యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ అధికారులు అభియోగాలు మోపారు. నిందితుల్లో ఒకరు చికాగో సబర్బన్‌లో ఉన్న ప్రాడిజీ మెయిలింగ్‌ సర్వీస్‌ సంస్థ యజమాని యోగేశ్‌ పటేల్‌(58) కాగా మరొకరు, అందులోనే ఆపరేటర్‌గా పనిచేస్తున్న అరవింద్‌ లక్కంసాని(57). వీరిద్దరూ కలిసి మరో నిందితుడు, డైరెక్ట్‌ మెయిల్‌ రిసోర్సెస్‌ సంస్థ యజమాని డేవిడ్‌ గార్గానో(51)తో కుమ్మక్కై పైసా ఖర్చు పెట్టకుండానే పెద్దసంఖ్యలో ఉత్తరాలను డెలివరీ చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. 2010-15 మధ్యకాలంలో వీరు దాదాపు 8 కోట్లకు పైగా ఉత్తరాలను బట్వాడా చేసుకున్నట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ పోస్టల్‌ సర్వీస్‌ అధికారులు భావిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com