అమెరికా యవనికపై బావర్చి ఘుమఘుమల పతాక

* ఉత్తర కరోలినాలో నూతన శాఖ
* 13 అమెరికా రాష్ట్రాల్లో భారతీయ వంటకాల అసలైన తొలి చిరునామాగా గుర్తింపు

మన స్నేహితులను బట్టి మనల్ని అంచనా వేసినట్లే మన ఆహారాన్ని బట్టి మన నాగరికతను, సాంప్రదాయాన్ని బేరీజు వేయవచ్చునని చరిత్రకారుల కల్పన. పండుగలకు, ప్రధాన వేడుకలకు భారతీయ సాంప్రదాయంలో భోజనానిది ఓ ప్రత్యేక పాత్ర. ఆయా వేడుకలకు అనుగుణంగా రూపుదిద్దుకునే రుచులు పండుగ వాతావరణానికి మరింత వన్నె తీసుకొస్తాయి. “మన రుచిని కాపాడితే మన సాంప్రదాయాన్ని కాపాడినట్లే” అనే సమున్నత ఆదర్శానికి అగ్రరాజ్యంలో గొడుగుపడుతున్న భారతీయ హోటళ్లల్లో “బావర్చి”ది ప్రముఖ స్థానం. అమెరికాలోని ప్రవాసులకు భారతీయ హోటళ్లకు కొదవ లేకపోయినప్పటికీ, శుచి-రుచి-నాణ్యతల్లో రాజీపడకుండా ఉత్తమ ఉత్పత్తిని వడ్డించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడం బావర్చీకే సాధ్యమైన వ్యాపార సూత్రం. 2011లో తొలి శాఖను డల్లాస్‌లో ప్రారంభించిన ఈ సంస్థ కేవలం ఏడేళ్ల వ్యవధిలో నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 13 రాష్ట్రాల్లో 40కుపైగా విభాగాలతో అగ్రపథాన దూసుకుపోతోంది. పేరుకు సరితుగేలా అమెరికాలో మరే ఇతర భారతీయ హోటళ్లకు సాధ్యపడని రీతిలో 30కుపైగా బిరియానీ రకాలను నోరూరించే విధంగా అందించడం బావర్చి ప్రత్యేకత. ఈ నెల మొదటి వారంలో ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఎపెక్స్ నగరంలో మరో శాఖను ఏర్పాటు చేసి బావర్చి తన వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ముందడుగు వేస్తోంది. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ నానుడిని పూర్తిగా నమ్మి, ఆహారానికి సరికొత్త రుచులతో కూడిన సృజనాత్మకతను జోడించడం మేము ప్రదర్శించే వినమ్రపూర్వక గౌరవం. ప్రతిరోజు ఒకే విధమైన ఆహారం వలన జీవితం కూడా నిస్సారంగా మారుతుందనే సూత్రాన్ని మేము ఖచ్చితంగా విశ్వసిస్తాం. అందుకే సరికొత్తగా, సరదా సరదాగా, రుచికరంగా ఉండే వంటకాలను ప్రతినిత్యం మా పట్టికలోకి చేరుస్తాము. తద్వారా భోక్తల సంతృప్తికి చేరువ అవుతున్నాము. అమెరికాలో భారతీయులకు సంబంధించిన భారీ సభలు, సమావేశాలకు మేము ఆతిథ్యం అందించాము. ఆయా సభల విందును అందించేందుకు మమ్మల్ని ఎంచుకోవడం వెనుక ప్రధాన కారణం నాణ్యమైన వైవిధ్యభరిత రుచులు మాత్రమే” అని బావర్చి సంస్థల అధినేత కంచర్ల కిషోర్ TNIకు ప్రత్యేకంగా తెలిపారు. ఈ సంస్థ శాఖను మీ నగరంలో ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, సరికొత్త రుచులను ప్రయత్నించాలనుకున్నా – www.BAWARCHIBIRYANIS.com వెబ్‌సైట్‌ను సంప్రదించవల్సిందిగా ఆయన కోరారు.




tnilivetelugunewsinternationalbawarchi2018bawarchiindianrestaurantsbiriyanisbiryanisbawarchiplanodallasamericabestbiryanis

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com