అమెరికా వలస విధానాల్లో మార్పులు

అమెరికా వలస విధానాల్లోని లోపాలను వెంటనే సరిదిద్దాలంటూ చట్టసభ ‘కాంగ్రెస్‌’ సభ్యులకు దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు. గొలుసుకట్టు వలసలకు ముగింపు పలకాలని కోరారు. బంగ్లాదేశ్‌ నుంచి ఏడేళ్ల క్రితం వలస వచ్చిన 27 ఏళ్ల అకయెద్‌ ఉల్లా న్యూయార్క్‌ మెట్రోస్టేషన్‌లో సోమవారం ఆత్మాహుతి దాడికి యత్నించిన నేపథ్యంలో ట్రంప్‌ స్పందించారు. అమెరికా పౌరులను రక్షించేందుకుగాను కాంగ్రెస్‌ సత్వరం శాసన సంబంధిత సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను తాజా దాడి సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. వలస విధానాల్లోని లోపాల కారణంగా.. సమగ్ర పరిశీలన లేకుండానే కొందరు ప్రమాదకర వ్యక్తులు దేశంలోకి సులువుగా అడుగు పెట్టగలుగుతున్నారని అన్నారు. అమెరికాకు వచ్చేలా తమ బంధువులకు అవకాశం కల్పించే కుటుంబ గొలుసుకట్టు వలస విధానంలోనే ఉల్లా దేశంలోకి ప్రవేశించిన సంగతిని ప్రస్తావించారు. ఈ విధానానికి సత్వరం ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com