అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి ఉత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకూ జరగనున్నాయి. ఏటా లోక కళ్యాణం కోసం అంగరంగ వైభవంగా దుర్గగుడిలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. అమ్మవారి మూల స్వరూపానికి ప్రత్యేక పూజలతో పాటూ మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్తులో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. పూలు, పండ్లు, కూరగాయలతో అమ్మవారిని మూడు రోజులూ ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారికి అలంకరించే పండ్లు, కూరగాయల కోసం భక్తులు విరాళాలు ఇవ్వొచ్చని ఆలయ వైదిక కమిటీ విజ్ఞప్తి చేసింది. 25న తొలి రోజు ఉదయం 8గంటల నుంచి వినాయకపూజతో వేడుకలు ప్రారంభమవుతాయి. తొలిరోజు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 7 వరకూ మూలమంత్ర హవనాలు, మండప పూజ, హారతి, మంత్ర పుష్పాలు నిర్వహిస్తారు. 26న చండీ సప్తశతి హవణాలు, రుద్రహోమం, మండప పూజ, నీరాజనం, మంత్రపుష్ప పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 27న చివరి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ శాంతిక, పౌష్టిక హోమాలు, జయాదులు, దిక్పాలిక బలులు, కూష్మాండబలి, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, వేదాశీర్వచనం నిర్వహిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com