అయిపొయింది

ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అందాలతార నికిషాపటేల్కు కాలం కలిసిరాలేదు సరికదా..వచ్చిన అనేక అవకాశాలు వెనక్కు వెళ్లిపోయాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘పులి’లో మెరుపులు కురిపించిన ఈ బ్యూటీ ఆ చిత్రంతో యువతరం గుండెల్లో కాస్తంత స్థానానే్న సంపాదించుకుంది. అటు తర్వాత అడపా దడపా అవకాశాలు లభించినా ఈ భామ అనుకున్నంత మాత్రం క్రేజ్‌ని సంపాదించుకోలేకపోయింది. తాజా సాయిరామ్ శంకర్‌తో జోడీ కట్టింది. ‘అరుకురోడ్లో…’అనే చిత్రంలో అతడితో ఆడిపాడబోతోంది. వాసుదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వుంటుందని దర్శకుడు చెబుతున్నారు. అరుకురోడ్లో ప్రయాణిస్తున్న ఓ జంటకు ఎదురైన అనుభవాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాయిరామ్ శంకర్‌తో నికిషా చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఈ చిత్రం విజయం సాధిస్తే నికిషాపటేల్ అనుకున్న క్రేజ్ వస్తుందేమో చూడాలి మరి!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com