అర్హత కన్నా ఎక్కువ ఇవ్వరు

అర్హతకు మించి మనకు నయాపైసా కూడా ఎవ్వరూ ఎక్కువ ఇవ్వరనే సత్యాన్ని గ్రహించాలి అని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ‘హీరోయిన్లు పారితోషికం పెంచేశారని తరచూ వార్తలు వింటుంటాం. అలాంటి వాటిలో నిజం ఎంత ఉంటుంది? నిజంగానే సినిమా సక్సెస్‌ అయిన ప్రతిసారీ హీరోయిన్లు పారితోషికాన్ని పెంచేస్తారా?’ అని తమన్నాను అడిగితే ‘‘అలాంటిదేమీ ఉండదండీ. సినిమా, సినిమాకీ ఎవరూ పారితోషికాన్ని పెంచరు. నాయికకు ఉన్న మార్కెట్‌ ఎంత? ఇతర భాషల్లో సినిమాను విడుదల చేసుకోవాలనుకుంటే ఆ నాయిక వల్ల అదనంగా ప్రయోజనాలుంటాయా? అనే విషయాలను నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారు. దాన్ని బట్టే రెమ్యునరేషన్‌ను డిసైడ్‌ చేస్తారు. అంతేగానీ మన అర్హతకు మించి నయాపైసా కూడా ఎవ్వరూ ఎక్కువ ఇవ్వరు. ఒకవేళ నిజంగానే ఎవరైనా విజయం వచ్చిన ప్రతిసారీ పారితోషికాన్ని పెంచారనే అనుకుందాం… డిమాండ్‌ చేసిన అంత మొత్తాన్నీ నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే, దాని అర్థం ఆ నాయికకు అంత అర్హత ఉందని…’’ అని అన్నారు తమన్నా. గ్లామర్‌ చిత్రాల్లో నటించడం తేలిక అని అందరూ అనుకుంటారని, అందులో ఉన్న కష్టనష్టాలు షూటింగ్‌లో పాల్గొనే నాయికలకు తెలుసనీ, ఈ ప్రపంచంలో ఏదీ సులువు కాదనీ ఆమె చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com