అలవాట్లతో అధిక కొలెస్ట్రాల్

మిమ్మల్ని ఒక నిపుణుడు పరీక్షించి,మీ లక్షణాలన్నిటిని పరిశీలించి, మీకు ‘అధిక కొలెస్ట్రాల్’ ఉందని తేల్చారు. ఇది విని మీరు నిరాశ మరియు భయపడుతున్నారు, కదా?

ఇలా ఫీలవ్వటం సహజమే, ఎందుకంటే ఏ అనారోగ్యమైనా, చిన్నదైనా లేదా పెద్దదైనా, మీ రోజువారీ జీవితాన్ని, మనస్సు ప్రశాంతతను తప్పక ప్రభావితం చేస్తాయి!

ఉదాహరణకి, చాలా సాధారణమైన ఫ్లూ జ్వరం వచ్చినా కూడా అది పూర్తిగా తగ్గేవరకు మీ రోజువారీ పనులన్నీ వాయిదా పడతాయి. అందుకని పరిష్కారాలు లేని వ్యాధులు వచ్చినవారి రోజువారీ జీవితాలు ఒకసారి ఊహించుకోటానికి కూడా అసాధ్యం!

మనలో చాలామందికి ఈ ‘అధిక కొలెస్ట్రాల్’ పదం తెలుసు, కదా? ఈ కాలంలో ఈ జీవనవిధాన వ్యాధి చాలా సాధారణం అయిపోయింది!

మీ రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని ‘అధిక కొలెస్ట్రాల్ స్థితి’ అంటారు మరియు అది చాలా తీవ్రమైన సమస్య!

తీవ్రమైన గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర అలాంటి వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం.

జీవనవిధాన మార్పులు అంటే ఆరోగ్యకర డైట్, రోజువారీ వ్యాయామం మరియు కొన్ని ముఖ్యమైన మందులు వాడకంతో అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మీకు అధిక కొలెస్ట్రాల్ ఉంటే, ఈ కింది అనారోగ్యకర అలవాట్లను వదిలించుకోండి!

1.ఆరోగ్యకర కొవ్వులకు దూరంగా ఉండటం

మామూలు మనలాంటి మనుషులు అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవని, మళ్ళీ బరువు పెరగటం, కొలెస్ట్రాల్ స్థాయి పెరగటానికి కారణమవుతాయని అనుకుంటాం. కానీ శరీరానికి పనిచేయటానికి,ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అవసరమని అర్థం చేసుకోం. అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవి కావు. ఉదాహరణకి, పిజ్జాలు, బర్గర్లలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి, కానీ అవకాడోలు, నెయ్యి మరియు కొబ్బరికాయలోవి ఆరోగ్యానికి మంచివి! అందుకని మీ డైట్ కి ఆరోగ్యకరమైన కొవ్వులను జతచేయటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు, అది కూడా సహజంగా!

2.తప్పు రకాలైన మాంసం తినటం

మీరు మాంసాహారులైతే, దాదాపు ప్రతిరోజూ మాంసం వంటకాలు తినేవారైతే, మీకు అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే మీరు మొదటగా తప్పక మీ ఆహారంలో మార్పులు చేసితీరాలి. గోమాంసం,పందిమాంసం వంటి మాంసాలు తినటం వలన కొలెస్ట్రాల్ మరింత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. మీరు దాని బదులు సన్నని మాంసాలైన చికెన్, సముద్రపు ఆహారం వంటి ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవచ్చు.

3.తక్కువ కాల్షియం డైట్

మన శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి, ముఖ్యంగా ఎముకలు మరియు మెదడు సరిగ్గా ఎదగటానికి, కాల్షియం చాలా ముఖ్యమైన పోషక లవణం. అదనంగా, అనేక అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే, కాల్షియం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించటంలో సాయపడగలదు. అందుకని మీరు కాల్షియం ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు, పాల ఉత్పత్తులు, పాలకూర, గుడ్లు వంటివి తినకపోతే మీ కొలెస్ట్రాల్ సమస్య మరింత ముదిరే అవకాశం ఉంది!

4.బేకరీ ఆహారపదార్థాలు తినటం

మనందరికీ కేకులు, కుకీలు, తెల్ల బ్రెడ్ వంటివన్నీ ఇష్టం కదా? ఇవన్నీ పాపులర్ అయిన బేకరీ ఉత్పత్తులు, వీటిని అధిక మొత్తాల్లో ఈస్ట్, పంచదార మరియు ఇతర ప్రాసెస్డ్ పదార్థాలతో తయారుచేస్తారు. ఈ వాడే వస్తులు మన ఆరోగ్యానికి చాలా హానికరమైనవి, అది కూడా ముఖ్యంగా మీరు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతుంటే మరీ ఎక్కువ! బేకరీ ఆహారపదార్థాలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఇతర అనారోగ్యాలను కలిగించటంతో పాటు పెంచివేస్తాయి.

5.తక్కువ పీచు పదార్థాలున్న డైట్ తినటం వలన

మనకు తెలిసినట్లు, అవసరమైన పోషకాలు ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, ఖనిజలవణాలు వంటివాటితో పాటు ఫైబర్ కూడా మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఫైబర్ ప్రత్యేకంగా ముఖ్యం ఎందుకంటే, అది ఈ స్థితి వలన వచ్చే రక్తనాళాల్లో పూత తయారవ్వకుండా తొలగిస్తుంది. అందుకని మీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే మొలకలు, పండ్లు, ఆకుకూరల వంటివాటిని జతచేయడం మంచిది!

6.ఎక్కువగా మద్యపానం

మనకి ఇది తెలిసిందే ఎక్కువగా తాగితే, అదీ క్రమం తప్పకుండా తాగితే మన ఆరోగ్యానికి చాలా హానికరం అని, కదా?మానసిక సమస్యలే కాక, అది తీవ్రమైన శారీరక సమస్యలను కూడా తెస్తుంది, క్యాన్సర్ తో సహా! ఆల్కహాల్ లో అనారోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన అది మీ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను మరింత పెంచివేస్తుంది, మీరు అప్పుడప్పుడు మాత్రమే తాగినా కూడా!

7.బరువు తగ్గటం గురించి ఆలోచించకపోవటం

అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక శరీర కొవ్వు రెండూ జీవనవిధాన వ్యాధులని ఒకదానితో ఒకటి కలిసి తీసుకొస్తాయి. అధిక కొలెస్ట్రాల్ బరువు పెరగటానికి కారణమైతే, బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతుంది. అందుకని మీ కొలెస్ట్రాల్ నియంత్రణకోసం మీరు బరువు మరియు శరీరంలో కొవ్వు స్థాయి రెండూ తగ్గించుకోటానికి కష్టపడాలి. కఠినమైన డైట్ మరియు వ్యాయామం, వైద్యుని పర్యవేక్షణలో తప్పక అవసరం!

8.వివిధ నట్లను తినకపోవటం

మీకు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉన్నా లేకున్నా, క్రమం తప్పకుండా వివిధ నట్’స్ తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మొత్తంమీద మెరుగుపడుతుంది. నట్’స్ పప్పుల్లో స్టెరాల్స్ అనే సమ్మేళనాల వలన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గిస్తాయి. అందుకని ప్రతిరోజూ చేతిలో పట్టినన్ని నట్లు తినటం మీ అధిక కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తుంది.

9.మానసిక వత్తిడిని అదుపులో ఉంచుకోకపోవటం

మనకి ఇదివరకే తెలిసినట్లు, అనేక ఆరోగ్య సమస్యలకి ఒక ముఖ్య కారణం మానసిక ఒత్తిడి. అది శారీరకం మరియు మానసికం కావచ్చు. తలనొప్పుల నుంచి, మానసిక వత్తిడి మరీ కాన్సర్ లాంటి భయంకర రోగాలకి కూడా కారణమవ్వచ్చు! అందుకని మీ శరీరంలో మానసిక వత్తిడి వలన కార్టిసాల్ పెరిగినప్పుడు, ఈ కార్టిసాల్ మీ శరీరంలో తిరిగి కొలెస్ట్రాల్ ను పెంచవచ్చు. అందుకని మానసిక వత్తిడిని అదుపులో పెట్టుకోవటం వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com