అలోవెరా తేనే కలిపి తీసుకుంటే…

ప్రతిరోజూ పొద్దున్నే ఆలోవెరా మరియు తేనె కలిపి తీసుకోడం వలన 9 ఆరోగ్య లాభాలు

ఈ మధ్య కాలంలో, సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు లేదా మూలికా వైద్యం ప్రకటనలు చూసినప్పుడు,ఈ మూలికలు మరియు సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తుల్లో ఎక్కువ ఆలోవెరాని చూసుంటారు కదా?

మనం ఎప్పటినుంచో చూస్తున్నట్టు,ఫేస్ ప్యాక్ లు,ఫేస్ వాష్ లు, బరువు తగ్గే మందులు, ఎక్కువ కొలెష్ట్రాలకి మందులు మరియు తదితర వాటిల్లో కూడా ఆలోవెరా వంటి పదార్థాలు ఉంటాయి.

భారతదేశ పురాతన వైద్యమైన ఆయుర్వేదం కూడా, ఆలోవెరా ఒక ప్రకృతి సహజమైన మొక్క అని మరియు అందానికి ఇంకా దానిలో ఆరోగ్యానికి సంబంధించిన 50 ప్రయోజనాలు ఉంటాయని చెప్తుంది.

గత శతాబ్దంలో,ఆధునిక వైద్యం మరియు మందులు రావడంతో, జనాలు ఎన్నో రోగాలు తగ్గించే మరియు నివారించే ప్రకృతి పదార్థాలని నమ్మడం తగ్గించారు.

అయితే ఇటీవల అధ్యయనాలలో మరియు ప్రజల అనుభవాల నుంచి నిరూపితమైనది ఏంటంటే,ప్రకృతి నుంచి వచ్చే మందులు మరింత సమర్థవంతంగా పని చేస్తాయి మరియు ఆరోగ్యానికి తక్కువ హానికరం అని.

కనుక, అనేక రోగాలు తగ్గించే ఆలోవెరా మరియు తేన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని ఇక్కడ చూడండి

తయారు చేసే విధానం

రెండు చెంచాల ఆలోవెరా జెల్ని ఒక చెంచాడు తేనెతో కలిపి ఒక కప్పులో వేయండి.బాగా కలిపి ఒక మిశ్రమంగా తయారు చేయండి.ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం అల్పాహారానికి అరగంట ముందు తీసుకోండి.

ఇప్పుడు, దాని వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి

1.బరువు తగ్గిస్తుంది

కీళ్ళ నొప్పుల నుంచి గుండె జబ్బుల వరకు, చాలా రోగాలు బాగా బరువు ఉండటం మరియు స్థూలకాయం వల్ల అని మనందరికి తెలిసిందే.మనమే మన బరువుని అదుపులో పెట్టుకోడానికి తప్పనిసరిగా కష్టపడాలి.తేనెలో ఉన్న అనామ్లజనకాలు మరియు ఆలోవెరాలో ఉన్న విటమిన్-ఇ జీవక్రియ క్రమాన్ని పెంచి సహజంగా మరియు సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2) మలబద్ధకం నుంచి ఉపశమనం

వైద్య సర్వేల ప్రకారం, ప్రపంచంలో మల బద్దకం ద్వారా బాధపడుతున్న వాళ్ళు గత రెండు

దశాబ్దాల్లో 52% పెరిగారు.ఇది వాళ్ళ యొక్క అనారోగ్యకరమైన జీవనశైలి వల్లనే జరుగుతున్నది.ఆలోవెరా మరియు తేనె మిశ్రమం మలాన్ని మెత్తపరచి, పేగుల నుంచి మృదువుగా బయటకి వెళ్ళేటు చేసి, మల బద్దకాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

3. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

స్థిరమైన మరియు బలమైన రోగ నిరోధక శక్తిని మనమందరం పెంచుకోవాలి ఎందుకంటే మన రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే, రోగాలను తెచ్చే క్రిములతో పోరాడే శక్తి శరీరం కోల్పోతుంది. తేనెలో ఉండే అనామ్లజనకాలు మరియు ఆలోవెరాలోని సపోనిన్లు కలిసి పనిచేసి మీ రోగ నిరోధక శక్తిని బలపరిచి, తద్వారా సమర్థవంతంగా రోగాలని ఎదుర్కోని ,మనకి ఏవీ సోకకుండా కాపడుతుంది.

4. కణాల క్షీణతను తగ్గిస్తుంది

మన వయస్సు పెరిగేకొద్దీ, మన శరీరంలోని కణాలు మెల్ల మెల్లగా క్షీణిస్తాయి, ఇది ప్రకృతి సహజం.అయితే కొందరిలో ఈ ప్రక్రియ తొందరగా మొదలయి, అకాలంగా వయసు పెరిగిపోవడం, బలహీనత మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.ఆలోవెరా మరియు తేనెలో ఉన్న వివిధ రకాలైన అనామ్లజనకాలు, ఖనిజాలు మీ శరీరంలో కణాలు క్షీణించే ప్రక్రియను నెమ్మది పరిచి, కణాల్ని పోషక విలువలతో బలపరుస్తాయి.

5. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఈ మధ్య కాలంలో, కాలుష్యం వలన మరియు కంప్యూటర్ దగ్గర గంటలు, గంటలు పని చేయడం వలన,చాలా మంది చూపు పొడిబారటం, మసక బారటం,కంటి ఎలర్జీలు తదితర సమస్యలు అనుభవిస్తారు. ఆలోవెరాలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది,అందువల్ల సహజంగానే ఈ మిశ్రమం కంటి కణాలను బాగుచేసి పైచెప్పిన చిన్న చిన్న సమస్యలన్నిటిని తగ్గించేస్తుంది.ఈ మిశ్రమాన్ని కళ్ళల్లో వేసుకోకూడదు, తినడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి.

6. దెబ్బలు త్వరగా తగ్గిపోతాయి

ఆలోవెరా మరియు తేనె రోజూ తీసుకోవడం వల్ల,మన శరీరం యొక్క దెబ్బలు తగ్గించే సామర్థ్యం పెరుగుతుంది మరియు గాయాలు త్వరగా మానిపోతాయి.ఇది ఎందుకంటే,అలోవెరాలో ఉండే ఆక్సిన్,గిబ్బర్లిన్స్ అనే హార్మోన్లు,దెబ్బ తగిలిన చోట కణజాలాలను వెంటనే పెరగటానికి అనుమతిస్తాయి. అందువలన గాయాలు బాగా, త్వరగా నయం అయిపోతాయి.

7.సూక్ష్మక్రిముల ద్వారా వచ్చే వ్యాధులను నిరోధిస్తుంది

వైరల్ ఫ్లూ,బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తదితరమైనవి చాలా సాధారణం, ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు శరీర రోగనిరోధక వ్యవస్థ అడ్డంకిని సులభంగా దాటేస్తాయి.ఆలోవెరా మరియు తేనె, రెండిటిలో ఉన్న సూక్ష్మజీవ వ్యతిరేక గుణాలు, ఈ క్రిములని శరీరంలోకి ప్రవేశించనీయకుండా పోరాడి, శరీరనికి హానికరమైన రోగాలు రాకుండా కాపాడతాయి.

8.సహజంగా ఓపికను పెంచుతాయి

ఆలోవెరా మరియు తేనె రోజూ తీసుకోవడం వలన, మీరు మీలో చాలా ముఖ్యమైన తేడా చూస్తారు. రోజూ చేసే రోజువారీ పనులు మరింత ఉత్సాహంతో చేస్తారు.ఎందుకంటే ఆలోవెరాలో ఉన్న పొటాషియం మరియు తేనెలో ఉండే అనామ్లజనకాలు కలిసి సహజంగానే రోజు ప్రారంభం నుంచి మీలో శక్తిని పెంచుతాయి .

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com