అల్లూరి సీతారామరాజు కథ అంతా అబద్ధమే

1924లో బ్రిటిష్‌ వారి తూటాలకు బలైంది అల్లూరి సీతారామరాజు కాదని, ఆ ఘటనలో ఉప్పరాపల్లి వీరవెంకటాచార్యులు అనే వ్యక్తి చనిపోయారని, నిజానిజాలు తేలాలంటే అల్లూరి కుటుంబసభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదువుతున్న అల్లు నాగసింహాద్రి కోరారు. విశాఖలోని డాబాగార్డెన్స్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. అల్లూరి జీవిత చరిత్రపై 2012 నుంచి అధ్యయనం చేస్తున్నానన్నారు. ఈ పరిశోధనకు 2015లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి తీసుకుని తూర్పుగోదావరి జిల్లా బెండపూడిలోని సాధువు నివాసాన్ని సందర్శించానన్నారు. సీతారామరాజు బెండపూడి సాధువుగా 1939 నుంచి 1968 వరకూ ఆ గ్రామంలో నివసించి, అక్కడే మృతిచెందినట్లు వెల్లడైందన్నారు. ఆయన భార్యలైన సావిత్రి, అన్నపూర్ణమ్మ ఆశ్రమంలో ఇప్పటికీ జీవించే ఉన్నారన్నారు. వారికి సాధువు ద్వారా జన్మించిన 9మంది పిల్లలు ఉన్నారని, అల్లూరి మరణంపై అపోహలు తొలగాలంటే ఆ పిల్లలకు, సీతారామరాజు కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని నాగసింహాద్రి కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com