అవయవదానం చేసిన గౌతీ

ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న భారత ఆటగాళ్లందరూ తాజాగా అవయవదానం చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఏటా సుమారు వెయ్యి మంది మాత్రమే అవయవదానం చేస్తున్నారు. ఏటా సుమారు ఐదు లక్షల మంది సరైన సమయంలో అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్‌ ఆఫ్‌ గివింగ్‌’ పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం నడుం బిగించింది. ఈ సందర్భంగా గౌతమ్‌ గంభీర్‌, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. ‘ప్రతి ఒక్కరు అవయవదానం చేయండి. నేను అవయవదానం చేశాను. ఈ దానం వలన మరొకరికి మెరుగైన జీవితం అందుతోంది. మనం జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం మనం చేయగలమా. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా కూడా తప్పకుండా ఇందులో భాగమవ్వండి’ అని గంభీర్‌ కోరాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆరంభంలో దిల్లీ డేర్‌డెవిల్స్‌కు నాయకత్వం వహించిన గంభీర్‌ ఆ తర్వాత జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం దిల్లీ జట్టును నడిపిస్తున్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com