అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ యాత్రకు సిద్ధమవుతున్నారు. వారంలోపే యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలనూ చుట్టివచ్చేలా యాత్ర ఏకబిగిన కొనసాగనుంది. యాత్ర పేరు, ప్రారంభ తేదీ, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందనేదీ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు. యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌పై కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ యాత్ర కోసం ఒక వావానాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనంతోపాటు, యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమై, ఎక్కడ ముగించాలనేదీ పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేయాల్సి ఉంది. ప్రజల్లోకి వెళ్లడం.. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను గుర్తించడం.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా యాత్ర చేపడుతున్నారు. ప్రధాన సమస్యలున్న ప్రాంతాలకు వెళ్లినపుడు ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చేదీ వాటి పరిష్కారంలో పార్టీ విధానం ఏంటనేదీ అక్కడికక్కడే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ కమిటీల ఏర్పాటు కొనసాగుతున్నందున ఆయా జిల్లాల్లో వాటి పురోగతిపై పార్టీ ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com