ఆగష్టు 9 నుండి భారతీయ విద్యార్థులకు కష్టాలు

వీసా గడువు ముగిసినా అమెరికాను వీడని విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకునేలా వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ ట్రంప్‌ యంత్రాంగం ఇటీవలే ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. ఈ కొత్త విధానం ఆగస్టు 9 నుంచి అమల్లోకి రానుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం.. నిర్దేశిత కోర్సు సమయం ముగిసిన రోజు నుంచి లేదా అనుమతించిన గ్రేస్‌ పీరియడ్‌ ముగిసినప్పటి నుంచే విద్యార్థులు అక్కడ ఉన్న ప్రతి రోజునూ చట్టవిరుద్ధంగా ఉన్నట్టే భావిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారమైతే.. అలాంటివారిని గుర్తించిన రోజు నుంచి చట్టవిరుద్ధంగా ఉన్నట్టు లెక్కిస్తున్నారు.
**ఉదాహరణకు ఒక విద్యార్థి వీసా కాలపరిమితి అక్టోబరు 1తో ముగిసిందనుకుంటే.. ఏ జనవరిలోనో ఆ విద్యార్థిని ఇమిగ్రేషన్‌ అధికారులు గుర్తిస్తే జనవరి నుంచే అతడి ఉనికిని చట్టవిరుద్ధంగా భావిస్తున్నారు ప్రస్తుతం. కొత్త నిబంధనల ప్రకారమైతే.. అక్టోబరు 1న కాలపరిమితి ముగిస్తే రెండో తేదీ నుంచి అతడు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్నట్టే. ఒక వ్యక్తి అమెరికాలో ఎన్ని రోజులపాటు అక్రమంగా ఉన్నాడనే దాని ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. ఒక విద్యార్థి వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత 180 రోజుల కన్నా ఎక్కువ రోజులు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే సదరు విద్యార్థిని డీపోర్ట్‌ చేసి మళ్లీ 3 నుంచి 10 సంవత్సరాల దాకా అమెరికలో డుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. ఏడాది కన్నా ఎక్కువకాలం అక్రమంగా ఉంటే.. శాశ్వతంగా నిషేధం విధిస్తారు.
**చైనీయుల తర్వాత మనమే
గణాంకాల ప్రకారం అమెరికాలో విద్యనభ్యసించేందుకు అత్యధికంగా వచ్చేది చైనీస్‌ విద్యార్థులు. వారి తర్వాత భారతీయులే ఎక్కువ. కాలపరిమితి ముగిసినా ఉండిపోయేవారిలో కూడా ఈ రెండు దేశాలవారే అధికం. 2016 సంవత్సరానికి గాను హోంలాండ్‌ సెక్యూరిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆ ఏడాది మన విద్యార్థుల సంఖ్య 98,970.2016 సెప్టెంబరు 30 నాటికి వీసా కాలపరిమి ముగిసిపోయినా ఇంకా అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 4,575.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com