అమెరికాలో సీతారామ కళ్యాణం

అమెరికాలోని హోస్టన్‌ నగరంలో భద్రాద్రి రాముడి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. అనంతరం కెనడా, సింగపూర్‌, మలేషియా, తదితర దేశాల్లో కూడా కల్యాణం జరగనుందని, ఆటా కో-ఆర్డినేటర్‌, ప్రముఖ నాట్య కళాకారిణి పద్మజారెడ్డి తెలిపారు. సోమవారం లక్డీకాపూల్‌ సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆమె భద్రాచలం ఆలయ అర్చకుడు మదన్‌మోహనాచార్యులు తో కలిసి మాట్లాడారు. అమెరికాలోని హోస్టన్‌ నగరంలో ఈ నెల 29, 30, జూలై 1వ తేదీలో తనతోపాటు శిష్య బృందం నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రసమయి బాలకృష్ణ బృందం కళాకారులు కూడా పాల్గొంటారని తెలిపారు. దాదాపు 10వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమంలో క్లాసికల్‌ నృత్యంతో పాటు నవదుర్గలు అనే అంశంపై ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జూలై 1న భద్రాచలం నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకెళ్లి ఆ ఆలయ అర్చకులతో కల్యాణం జరిపించనున్నట్లు తెలిపారు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డితో పాటు పలువురు హాజరవుతారన్నారు. అనంతరం జూలై 8న కెనడాలో తదనంతరం సింగపూర్‌, మలేషియా, తదితర దేశాల్లో ఈ కల్యాణోత్సవం ఉంటుందన్నారు.మదన్‌మోహనాచార్యులు మాట్లాడుతూ భద్రాచలం రామయ్య కల్యాణం ఇతర దేశాల్లో నిర్వహించడం వల్ల లోకకల్యాణం జరుగుతుందన్నారు. పద్మజారెడ్డి శిష్య బృందం శాలిని, భూమిక, రేణుక, ఆశా, చందన, హర్షిణి పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com