ఆడంబరాలకు నేను వెళ్ళను

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవల తన తండ్రి నగల వ్యాపారంలోనూ పాలుపంచుకుంటోంది. సినిమాల్లో అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న ఈ సుందరి ఇప్పుడు బాహ్య ప్రపంచంలోనూ అలాగే దర్శనమిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. “సినిమాల్లో టాప్ హీరోయిన్గా ఎదగడం నా అదృష్టం. నిరాడంబరంగా ఉండటమే నాకిష్టం. దుస్తులు అలాంటివే ఎంపికచేసుకుంటాను. ఇక సినిమాల్లో ధరించే దుస్తుల విషయాన్ని చిత్ర దర్శకుడు, కాస్టూమ్ డిజైనర్లు చూసుకుంటారు. నిజ జీవితంలో అలాంటి దుస్తులు ధరించను. అదే సమయంలో నా దుస్తులు స్టైలిష్గా ఉండేలా చూసుకుంటాను. నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వారిని చూసి డ్రస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక మనం ధరించే దుస్తులు మనం ఎలాంటి భావాలు గల వారమన్నది తెలియజేస్తుందని నా అభిప్రాయం”అని తమన్నా పేర్కొంది. “ప్రపంచంలోనే నాకు నచ్చిన పెళ్లికూతురు ఎవరని అడిగితే యువరాణి డయానా అని చెబుతాను. ఆమె వివాహ వేడుక నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వేడుకలో డయానా ధరించిన దుస్తులు, నడక నన్ను అబ్బురపరిచాయి. చరిత్రలో ఆమె గొప్ప సుందరిగా నిలిచిపోయింది. ఇకపోతే నా పెళ్లిని ఆడంబరంగా జరుపుకోను. అలా జరిగే వివాహం నాకు నచ్చదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటాను. అందంగా, అర్థవంతంగానూ నా పెళ్లి వేడుక ఉంటుంది”అని ఈ బ్యూటీక్వీన్ తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com