ఆడపిల్లల జోలికి వస్తే…అదే మీ చివరి రోజు

‘ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్‌. అదే మీ చివరి దినం’ అంటూ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సోమవారం విజయవాడలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతకుముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకూ ప్రదర్శన చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ‘దాచేపల్లి ఘటన దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మానవత్వానికే సవాలు. అమ్మమ్మ ఇంటికి వెళ్దామని చెప్పి బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకోవాలని అధికారులను ఆదేశించాం. 17 పోలీసు బృందాలు డ్రోన్లతో కూడా గాలించారు. ఇలాంటి ఘటనల్లో నిందితుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. వారికి భూమి మీద ఉండే హక్కు లేదు. దిల్లీలో నిర్భయ ఘటన జరిగితే అనకాపల్లిలో మహిళలు ఆందోళన చేశారు. పాదయాత్రలో ఉన్న నన్ను కలిసి ఆడపిల్లలకు అండగా నిలవాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని బలోపేతం చేస్తాం. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిందితులకు మూడు నెలల్లో శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి. దాచేపల్లి ఘటన చివరిది కావాలి. దాచేపల్లిలాంటి ఘటనలు పునరావృతమైతే నిందితులకు అదే చివరి దినం కావాలి.’’ అంటూ మృగాళ్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com