ఆఫ్రికా ఖండం నుండి అన్నీ జట్లు ఔట్

ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశ పోరు ముగిసింది. పాత కథను పునరావృతం చేస్తూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ బ్రెజిల్‌, మాజీ ఛాంపియన్లు స్పెయిన్‌, అర్జెంటీనా అతి కష్టం మీద టోర్నీలో మొదటి దశను దాటాయి. ఇలా ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకొన్నాయి. అయితే గ్రూప్‌-హెచ్‌లో పోరు మాత్రం ఆసక్తికరంగా ముగిసింది. ముందుగా నాకౌట్‌కు చేరే అవకాశాలున్న ఏకైక ఆఫ్రికా జట్టు సెనెగల్‌ 0-1తో కొలంబియాపై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా, పోలెండ్‌పై ఓడినా.. తొలిసారి ఫేయిర్‌ ప్లే ర్యాంకింగ్‌ ఆధారంగా ఆసియా జట్టు జపాన్‌ నాకౌట్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా సెనెగల్‌ నిష్ర్కమణతో ఈ ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్ల పోరాటం ముగిసినట్లయింది. దీంతో ఫిఫా చరిత్రలో 36ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా జట్ల ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. 1982 ఫిఫా ప్రపంచకప్‌ తర్వాత ఏ ఒక్క ఆఫ్రికా జట్టు కూడా రెండో రౌండ్‌కు చేరుకోకుండా టోర్నీ నుంచి నిష్క్రమించడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. 1982టోర్నీ తర్వాత నుంచి ప్రతి ఫిఫా ప్రపంచకప్‌లోనూ ఏదో ఒక ఆఫ్రికన్‌ జట్టు రెండో రౌండ్‌కు అర్హత సాధిస్తూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం అది కలిసిరాలేదు. కాగా ఈ ప్రపంచకప్‌కు ఆఫ్రికా నుంచి ఈజిప్టు, మొరాకో, టునిషియా, నైజీరియా, సెనెగల్‌ అర్హత సాధించాయి. ఇందులో ఎన్నో అంచనాలతో అడుగుపెట్టిన ఈజిప్టు, మొరాకో తీవ్రంగా నిరాశ పరచాయి. టునిషియా మాత్రం నామమాత్ర ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే నైజీరియా, సెనెగల్‌, నాకౌట్‌కు చేరుకునే ప్రయత్నం చేసినా చివరి మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఫలితం లేకుండా పోయింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com