ఆయనకు బాగా పెరిగింది

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రాన్ని, ప్రజలను దిల్లీలో తాకట్టు పెట్టారని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. భాజపాను విమర్శిస్తే.. ఆ పార్టీ నేతల కంటే విజయసాయిరెడ్డే ఎక్కువ బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ అండ చూసుకుని ఆయనకి అహంకారం పెరిగిందన్నారు. వైకాపా నేతల నటన ముందుకు ఎస్వీఆర్‌ లాంటి వారు కూడా సరిపోరన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాలని ఆ పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కర్ణాటకలో భాజపాని ఓడించడానికి బృందాలను పంపాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని నరేంద్ర పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com