ఆయనది నీకెందుకు

అదేంటి అజిత్‌ను నయనతార కాల్షీట్‌ కోరడమేంటని ఆశ్చర్యపోతున్నారా?.. అయితే ఆమె కోరుతున్నది తన కోసం కాదట. తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కోసమే ఈ కాల్షీట్‌ అడుగుతున్నట్లు కోలీవుడ్‌లో కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార మీడియాతో మాట్లాడకపోయినా ఆమెకు సంబంధించిన వార్తలు నిత్యం మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సరికొత్త వార్తలో నిలిచింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సైమా అవార్డుల్లోనూ ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేశారు. అంతేకాకుండా విఘ్నేశ్‌ దర్శకత్వంలోని ‘నానుం రౌడీదాన్‌’లో భిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు. పలు కార్యక్రమాలకు వీరు కూడా జంటగానే హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆమె త్వరలోనే నిర్మాతగా మారునున్నారని, ఆ తొలి సినిమాకు విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అజిత్‌ను నటింపజేయాలని, అందుకు అజిత్‌ కాల్షీట్‌ కోసం ఏకంగా నయనతారే ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్‌కు 2018 వరకు కాల్షీట్‌ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com