ఆయన బట్టతల రహస్యం చెప్పలేదు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లో ఎంత స్టైల్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించినా..బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు జుట్టు లేకపోయినప్పటికీ ఎలాంటి విగ్గులు పెట్టుకోకుండా నేచురల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. అయితే ఇటీవల తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత ఏసీ షణ్ముగన్‌ను డాక్టరేట్‌తో‌ సత్కరించేందుకు చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తలైవా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీ..తన స్నేహితుడైన షణ్ముగన్‌ గురించి మాట్లాడుతూ..‘షణ్ముగన్‌ నాకు దాదాపు 1980 నుంచి తెలుసు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ వయసులోనూ అతని ముఖంలో కళ ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయన హెయిర్‌స్టైల్‌ కూడా బాగుంటుంది. ఆయన తన హెయిర్‌స్టైల్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలిసుంటే నేను కూడా కేర్‌ తీసుకునేవాడిని’ అని చమత్కరించారు రజనీ. ఆయన ప్రసంగం విని అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం రజనీ..కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో తలైవాకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా తర్వాత రజనీ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిపెడతారని కోలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com